సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పాల్గొన్నారు. ముందుగా ఆయన 80 లక్షల నిధులతో తాడేరు రోడ్డు లో 700 కుటుంబాలకు అవసరమయ్యే సిసి డ్రైన్ , కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. అనంతరం రూ 11 లక్షల 70 వేల రూపాయల నిధులతో టిడ్కో గృహాల వద్ద ఏర్పాటుచేసిన సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ… భీమవరం పట్టణంలో ఇల్లు లేని పేదలకు టిడ్కో గృహాలకు సంబంధించి ఎస్ టి పి ప్లాంట్ పనులు త్వరితగతిన జరుగుతున్నాయని, ఈ పనులు పూర్తయిన వెంటనే రెండో విడత టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగిస్తామని అన్నారు. ఇప్పటికే మొదటి విడతగా 2 వేల మంది లబ్ధిదారులకు గృహాలను అప్పగించడం జరిగిందని అన్నారు. రెండో విడతగా 2 వేల 500 మందికి గృహాలను అప్పగించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో తాడేరు రోడ్డు లో నిర్మించిన 700 గృహాలకు అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం రూ 80 లక్షల నిధులతో సీసీ డ్రైన్, కల్వర్టు కూడా నిర్మిస్తున్నామని అన్నారు. పట్టణ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో అధికారులు, వైసిపి నేతలు పాల్గొన్నారు.
