సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నేడు, సోమవారం, హైద్రాబాద్లో ని లోటస్ పాండ్ లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి, వైఎస్ షర్మిల ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో సిట్ అధికారులను కలిసి వినతి పత్రం ఇవ్వడానికి బయలు దేరిన ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. ఇవాళ ఉదయం 10:30 గంటలకు లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయం నుంచి షర్మిల బయలుదేరుతుండగా పోలీసులు ఒక్కసారిగా పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. బయటకు వెళ్లేందుకు అనుమతిలేదని ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆమె కు మహిళా పోలీసులకు త్రోపులాట జరగటంతో షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తన తప్పులేకపోయినా పోలీసులు తనపై ప్రవర్తించిన తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ఆమెను పోలీసులపై చెయ్యి చేసుకోనుందని కేసు పెట్టి అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విధుల్లో ఉన్న ఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నందుకు షర్మిలపై ఐపీసీ 330, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై అని వైఎస్ విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిలను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించిన ఆమె.. సిట్ కార్యాలయానికి షర్మిల వెళుతుంటే పోలీసులే అడ్డుకొని దురుసుగా ప్రవర్తించారన్నారని మండిపడ్డారు. పోలీసులు మీద మీద పడుతుంటే ఆవేశం రాదా? అని.. తాను కొట్టాలంటే ఎంతసేపని ప్రశ్నించారు.
