సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు మంగళవారం (ఏప్రిల్ 25న) ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. మే, జూన్ నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు మంగళవారం ఉదయం 10గంటలకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. కాబట్టి భక్తులు టిటిడి అధికారిక వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in/ లో మాత్రమే దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని ప్రకటించారు.
