సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, రాజంపేట ఎంపీ, పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి , వైసిపి పార్టీ నేతలతో గోదావరి జిల్లాల కో ఆర్డినేషన్ మీటింగ్ లలో భాగంగా ఉండి నియోజకవర్గ పార్టీ సమీక్ష సమావేశానికి హాజరయ్యేందుకు నేడు గురువారం భీమవరం రాగా, స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఉండి పార్టీ కన్వీనర్ కెవిఎల్ నరసింహరాజు తో కలసి ఘన స్వాగతం పలికారు. అనంతరం భీమవరం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు సంబంధించి కేంద్ర నిధులు మంజూరు కై వినతి పత్రం అందించారు. అనంతరం ఉండి సమీక్షా సమావేశంలో కార్యకర్తల నుద్దేశించి వైసిపి పార్టీ బలోపేతం చేసే అంశం ఫై సూచనలు చేసారు.
