సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నేడు, మంగళవారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. ఖార్గోన్ పట్టణంలో ఇండోర్ వెళుతున్న బస్సు ప్రమాదవశాత్తూ వంతెనపై నుంచి కిందపడిపోవడంతో 14 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఆ ప్రాంతంలోని స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మృతుల కుటుంబ సభ్యులకు 4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
