సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారంస్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ 10 కోట్ల రూపాయలతో భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామ ప్రధాన రహదారి దిరుసుమర్రు సింగరాజుపాలెం నుండి వెంప రోడ్డు వరకు 7 కిలోమీటర్ల మేర నూతనంగా నిర్మాణం చేసిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు, వైసిపి కార్యకర్తలు ఆయనకు పుష్పాలతో దారిపొడవునా స్వాగతం పలికారు. తదుపరి ఎమెల్య గ్రంధి శ్రీనివాస్ దిరుసుమర్రు గ్రామంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మాణం చేసిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ZPTC, MPP,MPTC, ప్రజా ప్రతినిధులు తో పాటు వేండ్ర వెంకట స్వామి, గూడూరి ఉమాబాల వంటి పార్టీ కీలక నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ..రాష్ట్రంలో జగన్ సర్కార్ కేవలం ప్రజలకు సంక్షేమ పధకాలు మాత్రమే కాదు.. గ్రామస్థాయి నుండి కోట్లాది రూపాయలు ఖర్చుతో గతంలో ఏ ప్రభుత్వం సాధించలేని విధంగా రోడ్డులు, డ్రైనేజిలు ,ఇతర మౌళిక సదుపాయాల కల్పనలో, సచివాలయ భవన నిర్మాణాలలో ముందున్నది అన్నారు. సీఎం జగన్ సహకారంతో తో భీమవరం అభివృద్ధి లో ప్రజలకు ఏదికావాలన్న అన్ని రంగాలలో అభివృద్ధి పధంలో నడుస్తుందన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *