సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పట్టణంలో జనసేన భీమవరం మండల నూతన కమిటీ నియామకం జరిగింది. మంగళవారం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగింది. జిల్లా అధ్యక్షుడు& నియోజకవర్గ ఇన్చార్జి కోటికల పూడి గోవిందరావు (చినబాబు)నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. చినబాబు మాట్లాడుతూ మండలం అధ్యక్షులుగా మోకా శ్రీనివాస్ ని నియమించామన్నారు. మండల కమిటీ 28 మంది సభ్యులతో కూడిన కమిటీని వేశామని ఆయన తెలియజేశారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతంగా ఈ మండల కమిటీ కృషి చేయాలని కొత్త కమిటీ కి సూచించారు. అనంతరం PAC సభ్యులు కనకరాజు సూరి మాట్లాడుతూ.. అన్ని సామాజిక వర్గాలతో కూడిన బలమైన కమిటీని నియమించామని పట్టుదలతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్రశేఖర్ , పట్టణ సెక్రటరీ సుంకర రవి, జనసేన నాయకులు బండి రమేష్ కుమార్, పంతం ప్రసాద్, కాళీ శేఖర్,ఆకుల శ్రీనివాస్ రామాయణం శ్రీనివాస్, ఉండవల్లి శ్రీనివాస్, అప్పారావు మారిసెట్టి రాంప్రసాద్, భగత్ సింగ్, పత్తి హరి, గ్యాస్ శ్రీను, అతికల ఆంజనేయ ప్రసాద్, మండల ప్రెసిడెంట్ మోకా శ్రీనివాస్, సెక్రటరీ కత్తుల నీలెంద్ర, వైస్ ప్రెసిడెంట్లు, మండల కమిటీ సభ్యులు,నాయకులు, పట్టణ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *