సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు లో ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణం చెల్లించలేక కొక్కు రమేష్‌ (29) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగాను , అటు కైకలూరులోను సంచలనం రేపింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసుల సమాచారం ప్రకారం .. ఆకివీడుకు చెందిన కొక్కు రమేష్‌ ఓ ఫైనాన్స్‌ కంపెనీ లో పనిచేస్తున్నాడు. అయితే ఆకివీడులో ఇంటి నిర్మాణం కోసం తన అన్న రాజేష్‌తో కలిసి రూ. 10 లక్షలు బ్యాంకు రుణాన్ని తీసుకున్నాడు. నెలవారీ వాయిదాలు చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులతో సతమాతమౌతున్న రమేష్‌ ఈనెల 8న ఊరికి వెళుతున్నాని తల్లిదండ్రులకు చెప్పి కైకలూరులోని హోటల్లో రూమ్‌ తీసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొన్నట్లు భావిస్తున్నారు. అయితే కుటుంబ సబ్యులకు హోటల్ రూమ్ లో రమేష్ మరణించిన 2 రోజులకు విషయం తెలిసింది. అయితే 10 లక్షల లోను తీర్చలేక యువకుడు మరణించడం ఏమిటి ? ఎవరి హస్తం అయిన ఉందా ?అన్న కోణంలో కైకలూరు పోలీసులు అనుమానాస్వాద మృతి గా కేసు దర్యాప్తును అన్ని కోణాలు లోను కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *