సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా లో తడిసిన ధాన్యం కొనుగోలు చెయ్యాలంటూ రాష్ట్ర ప్రతిపక్ష నేత చం ద్రబాబు ‘రైతు పోరుబాట’ పేరుతో నేడు, శుక్రవారం 12 కిలో మీటర్లు మినీ పాదయాత్ర ప్రారంభించారు. దీనిలో భాగంగా విశేషంగా వచ్చిన టీడీపీ శ్రేణుల తో కలసి ఇరగవరం నుంచి తణుకు వైజంక్షన్ వరకు ఈ పాదయాత్ర ను కొనసాగిస్తున్నారు. మార్గ మధ్యంలో స్థానిక రైతులతో, టీడీపీ నేతలతో అయన మాట్లాడుతూ సమస్యలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. పాదయాత్ర ప్రారంభంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రైతులను రాష్ట్ర ప్రభుత్వం సర్వనాశనం చేసిందని దానితో అనేక సమస్యలతో రైతులు రోడ్డెక్కా రని.. తిరుగుబాటు చేస్తున్నారని అన్నారు. రైతు కు ఒక్క రూపాయి నష్టం లేకుండా. కల్లాల్లోని ధాన్యం కొనే వరకు రైతుల తరఫున పోరాడుతానని పిలుపు నిచ్చారు. ఆయన పాదయాత్రంలో తణుకు ప్రాంత టీడీపీ నేతలు తో పాటు ఉండి మాజీ ఎమ్మెల్యే, కే శివరామరాజు కూడా పాల్గొన్నారు.
