సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు సినిమా తల్లి సెంటిమెంట్ కధ తో తెలుగు డబ్బింగ్ ఎంతటి సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే..పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ .. అయితే ఆ తరువాత అతని సినిమాలు అన్నీ తెలుగులోకి అనువాదం అయ్యాయి కానీ, ‘బిచ్చగాడు’ స్థాయి విజయం ఇవ్వలేకపోయాయి. ఇప్పుడు విజయ్ ఆంటోనీ నిర్మాతగానే కాకుండా, దర్శకత్వం, సంగీతం అందిస్తూ ‘బిచ్చగాడు 2’ సినిమా తో నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా కధ విషయానికి వస్తే.. ఈసారి చెల్లెలు సెంటిమెంట్ తో కధ నడుస్తుంది. భారతదేశంలో అత్యంత సంపన్న ధనవంతుల్లో విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోనీ)ది ఏడో స్థానం. అయితే అతను డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు అని చెప్పడానికి, ఎన్నికల ఫండ్ పేరుతో ముఖ్యమంత్రికి రూ 5,000 కోట్లు ఇస్తాడు. అలాగే అతని తండ్రి చనిపోతే, వెంటనే ఆ వార్తను ప్రకటిస్తే వందల కోట్లు నష్టం వస్తుందని తెలిసి తండ్రి మరణవార్తను ఒక రెండు నెలలు డిలే చెయ్యమంటాడు. అతనికి కంపెనీలో పనిచేసే అరవింద్ (దేవ్ గిల్).గురుమూర్తి కంపెనీని కూడా తమ హస్తగతం చేసుకోవాలని కుట్రలు కూడా పన్నుతూ వుంటారు..ఇతనికి విజయ్ లా వుండే సత్య (విజయ్ ఆంటోనీ) అనే బిచ్చగాడు వీళ్ళకి దొరుకుతాడు, అతనికి విజయ్ బ్రెయిన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు సత్య, విజయ్ లా మారతాడు. కానీ వాళ్ళు అనుకున్నది ఒకటి, అయినది ఇంకొకటి అవుతుంది. ఏమి జరిగింది అన్నది వెండితెరపై చూడవలసిందే.. ఇక సినిమా లో ద్విపాత్రాభినయానం తో పాటు దర్శకుడిగా, అలాగే రచన, సంగీతం కూడా విజయ్ ఆంటోని తన సత్తా చాటుకున్నాడు. అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో కూడా బాగానే చేసాడు. ఇందులో కథానాయకురాలు కావ్య తాపర్ చాలా గ్లామర్ గా అందంగా వుంది. ఆమె పాత్ర చిన్నదే అయినా, బాగానే చేసింది. తెలుగులో కూడా విలన్ గా కనిపిస్తూ వుండే దేవ్ గిల్ కి చాలా కాలం తరువాత ఒక మంచి పాత్ర దొరికింది. ఇప్పటి తరం ప్రేక్షకులకి, నచ్చేలా యాక్షన్ సన్నివేశాలు బాగా డిజైన్ చేశారు. పాత బిచ్చగాడు సినిమా తో ఆ డెప్త్ పీల్ సన్నివేశాల తో పోల్చకుండా సినిమా చుస్తే కచ్చితంగా సినిమా నచ్చుతుంది. , ‘బిచ్చగాడు 2’ చాలా కమర్షియల్ గా రిచ్ గా మంచి ఫీల్ తో తీసిన సినిమా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *