సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం శివారు లోని పెదమీరం గ్రామంలో ఎన్టీఆర్ శత జయం తోత్స వాలను పురస్క రించుకుని నేడు, సోమవారం సాయంత్రం నుండి తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి క్యాడర్ తో నిర్వహించిన మినీమహానాడు లో పాల్గొన్న వేలాది కార్యకర్తలనుద్దేశించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రసంగిస్తూ.. టీడీపీ అధికారంలోకి రావాలంటే పశ్చిమ గోదావరి ప్రజలు మద్దతు చాల కీలకమని..ప్రతి నేత, కార్యకర్త, ప్రజలలోకి వెళ్లి జగన్ సర్కార్ వైఫల్యాలను తెలియజేయాలని, తెలుగు దేశం పార్టీ వచ్చే ఎన్నికలలో తప్పనిసరిగా గెల్చి తీరాలని .. ఈసారి చంద్రబాబు ఓడిపోతే రాష్ట్ర ప్రజలు ఇల్లు ఖాళీ చేసి వెళ్లి పోవాల్సిందేనన్నారు. అవినాష్ రెడ్డి కేసు తప్పు దారి పట్టిస్తూ, సీబీఐ వ్యవస్థ నమ్మకంపై లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ తన బాబాయ్ హత్య కేసులో నిందితుడైన తమ్ముడు అవినాష్ రెడ్డి ని అరెస్టు చెయ్యనియ్యకుండ సీబీఐ అధికారులు ను అడ్డుకున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 160 సీట్లు గెలవడం ఖాయమన్నారు.మినీ మహానాడు ఏర్పాట్లను ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు పార్టీ జిల్లా అధ్య క్షురాలు తోట సీతారామలక్ష్మి , రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్ తదితరులు పర్యవేక్షించారు.
