సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ శివారు పెదమిరంలో జరిగిన తెలుగు దేశంపార్టీ మినీ మహానాడు లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేనలో టీడీపీ పొత్తు ఉంటుందని పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన కు కొన్ని సీట్లు కేటాయింపు ఖాయం అని సంకేతాలు స్వష్టంగా వెలువడ్డాయి. ఎప్పుడు జనసేన పొత్తుపై చాల ఆచితూచి మాట్లాడే.. టీడీపీ రాష్ట్ర అడ్జ్యాక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం అత్యంత అవశ్యకమని ..వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో టీడీపీ పోటీ చేయాలంటూ సీఎం జగన్మోహన్‌రెడ్డి, వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు జగన్‌వా? మా పార్టీల పూహ్యాలు మాకు ఉండవా? అంటూ నిలదీశారు. రాష్ట్రంలో డిసెంబర్‌లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, తెలుగుదేశం, జనసేన కలిసే ముందుకు వెళ్తాయని కార్యకర్తలకు బహిరంగంగా పిలుపు నిచ్చారు. మాజీ మంత్రి పితాని సత్యనారాణయన మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన పొత్తుల్లో కొన్ని సీట్లు త్యాగం చేయక తప్పదని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు అందుకు సిద్ధంగా ఉండాల ని పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో బీజేపీ ద్వంద్వ వైఖరి ని ప్రదర్శిస్తుందని విమర్శించారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా లోని 7 నియోజకవర్గాలలో పొత్తులలో జనసేన పార్టీ కి జిల్లా కేంద్రం భీమవరం , నరసాపురం సీట్లతో పాటు తాడేపల్లి గూడెం సిటు కేటాయింపు కు టీడీపీ సిద్దపడుతున్నట్లు తీవ్ర స్థాయి లో ప్రచారం ఉపందుకొంది.
