సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన .. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’లో ప్రధాన విలన్ గా గవర్నర్ స్కాట్ బక్స్ టన్ పాత్రలో కంటితో నిప్పులు కురిపిస్తూ నటించిన ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్(58) ఆకస్మికంగా కన్ను మూశారు. ఆయన అకాల మరణానికి కారణాలు తెలియరాలేదు. స్టీవెన్సన్ ‘థోర్’ , ది ట్రాన్స్పోర్టర్ సిరీస్ తో హాలీవుడ్లో తనకంటూ ఎంతో ప్రఖ్యాతి సంపాదించాడు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు షాక్ అయ్యారు. చివరిగా నటించిన డిస్నీ + వారి ‘అశోకా’ సిరీస్ త్వరలో విడుదల కానుంది. స్టీవెన్సన్ మృతిచెందడంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం ట్వీట్ చేసిం ది. ‘‘ఈ వార్త మమ్మల్ని ఎంతో షాక్ కు గురిచేసింది. మీ ఆత్మకు శాంతి కలగాలి. మీరెప్పటికీ మా హృదయాల్లో నిలిచే ఉంటారు’’ అని పేర్కొంది.
