సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల హైదరాబాద్ తో పాటు కోస్తా ఆంధ్ర లో పలు ప్రాంతాలలో చెదురుమదురుగా వర్షాలు పడుతూ ఉష్ణోగ్రతలు కాస్త తగ్గిన నేపథ్యంలో తాజగా..తెలుగు రాష్ట్రాల ప్రజలకు చెన్నై వాతావరణ కేంద్రం మరో చల్లటి కబురు చెప్పింది. ఐదు రోజులపాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని ఓ ప్రకటన చేసింది. నిన్న మంగళవారం నుంచి ఈ నెల 27వ తేది వరకు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల తమిళనాడు, రాయలసీమ పుదుచ్చేరి రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రస్తుతం దక్షిణ తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని, దీని ప్రభావం వల్ల రెండు రాష్ట్రాల కోస్తా తీరాల్లో గంటకు 40 నుంచి 45 కి.మీ వేగంతో, మధ్య 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. అందువల్ల ఈ నెల 25వ తేది వరకు జాలర్లు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరించింది.
