సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్; గత నెల రోజుల క్రితం వరకు నిమ్మకాయల ధరలు భారీగా పెరిగిపోయి రిటైల్ గా 3 కాయలు 20 రూపాయలు చేరుకోగా, ఇప్పుడు ఊహించని స్థాయిలో ధరలు దిగి వచ్చాయి. కేజీ నిమ్మకాయలు హోల్ సేల్ ధర 25 -30 రూపాయలకు దిగివచ్చింది. మండుటెండలో నిమ్మ రసం నీరు తో దాహార్తిని తీర్చుకొనేవారికి ఇక ధరలకు భయపడవలసిన అవసరం లేదు. అయితే.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిమ్మకాయలకు పెద్ద హోల్ సెల్ మార్కెట్ అయిన దెందులూరు ,ఉంగుటూరు ద్వారకా తిరుమల మార్కెట్ యార్డ్ లో రైతుల వద్ద నిమ్మకాయలు కు హోల్ సెల్ వ్యాపారులు కేజీ కి 10 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారంటూ.. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కానీ ధర అంటూ .. రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆ ప్రాంత నిమ్మ రైతులు ఆందోళన తో నిరసనలు తెలియజేస్తున్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్ట్‌లోని నిమ్మకాయల మార్కెట్‌లో గుట్టలు గుట్టలుగా పోసి నిరసన తెలిపారు.
