సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నెల రోజులు ముందుగా ఊహించినట్లే.. రేపు గురువారం జూన్‌ 1వ తేదీ నుంచి రిజిస్ర్టేషన్లపై చార్జీలు పెంచుతూ అదనపు బాదుడుకు సర్కారు రంగం సిద్ధం చేసింది.(3వారాల క్రితమే మన ‘సిగ్మా’ న్యూస్ సమాచారం ఇచ్చింది).దీంతో పశ్చిమ గోదావరి , ఏలూరు జిల్లాల లో పలువురు స్థిరాస్తుల కొనుగోలుదారులు ఆగమేఘాల మీద రిజిస్ర్టేషన్లకు ఆఫీస్ లకు పరుగులు పెట్టారు. గత సోమవారం ఉదయం నుంచి భీమవరం, గునుపూడి తోపాటు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అన్ని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు కొనుగోలు, అమ్మకందారులతో కిక్కిరిసిపోయాయి. అయితే మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు ఒక్కసారిగా ట్రాఫిక్ రద్దీతో సర్వర్లు డౌన్‌ అయ్యాయంటూ రిజిస్ర్టేషన్లు నిలిపివేశారు. దీంతో పలు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు వచ్చిన కొందరు తీవ్ర అసహనానికి గురై అక్కడి సిబ్బందితో వాదనలకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి కావాలనే ఇలా చేస్తోందని కొందరు విశ్లేషణ చేస్తున్నారు. అయితే నేడు, బుధవారం మరోసారి తమ అదృష్టం పరీక్షించుకొంటున్నారు. అయితే వచ్చినవారి అందరి రిజిస్ట్రేషన్స్ పూర్తీ అయ్యే అవకాశం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *