సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 11 వైద్య కళాశాలలకు అదనంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ.8,480 కోట్ల నిధులతో జగన్ సర్కార్ శ్రీకారం చుట్టిన విషయం విదితమే.. దీనిలో భాగంగా 5 నూతన కాలేజీలు ఇప్పటికే అన్ని వసతులతో నిర్మాణాలు పూర్తీ చేసి ప్రారంభానికి సిద్ధం అవుతున్న దృష్ట్యా ఈ విద్యా సంవత్సరం (2023–24) ఐదు కళాశాలల్లో750 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎం సీ) అనుమతి ఇచ్చింది. మచిలీపట్నం , ఏలూరు, నంద్యాల, రాజమండ్రి, విజయనగరం కళాశాలల్లోఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కొత్త కళాశాలలతో కలపి మరో 750 సీట్లు పెరుగుతాయి. దీంతో ప్రభుత్వ రంగంలోనే రాష్ట్రంలో 2,935 సీట్లు ఉంటాయి. వీటిలో15 శాతం ఆల్ ఇండియా కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లను రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. వచ్చే ఆగస్టులో అడ్మి షన్లు.. సెప్టెంబర్లో తరగతులు ప్రారంభమౌతాయని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి విడదల రజిని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *