సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం అధినేత చంద్రబాబు నేడు, శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని సన్ రైజ్ ఏపీగా మార్చుస్తామని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణానికి 33 వేల ఎకరాల భూసేకరణ చేశామని, 3 రాజధానులు పేరుతో సీఎం జగన్ అమరావతి నిర్మాణం నాశనం చేశారని దుయ్యబట్టారు. నేడు.. జూన్ 2.. ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన రోజు.. గతంలో టీడీపీ తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. ఏపీని కూడా అభివృద్ధి చేద్దామని నవనిర్మాణ దీక్షతో ప్రజల్లో ఒక చైత్యన్యం తెచ్చామని చంద్రబాబు తెలిపారు. నవ్యాంధ్ర కోసం 2029 విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని, జిల్లాల మధ్యలో రాజధాని పెట్టామని, రాజధాని కంటిన్యూ అయి ఉంటే.. ఇప్పటికే రూ.2 లక్షల కోట్ల సంపద వచ్చుండేదని చంద్రబాబు తెలిపారు.ఏపీని ఐటీ హబ్ చేయాలనుకుంటే.. గంజాయి హబ్‌గా మార్చారు. ప్రస్తుతం ఏపీకి, తెలంగాణకు ఆదాయంలో రూ.11,600 కోట్లు తేడా ఉందని తెలిపారు. పేటీఎం బ్యాచ్ దీనికేం సమాధానం చెబుతారు? ఒకటో తేదీన జీతాలివ్వమని ఉద్యోగులు అడిగితే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ‘‘సీఎం జగన్ కు తెలివి తేటలు ఎక్కువ. ఏ యూనివర్శిటీలో చదివారో మాత్రం చెప్పరు. అయితే మన టీడీపీ మేనిఫెస్టో అద్భుతమని స్వయంగా జగనే చెప్పారు’’ అని చంద్రబాబు ఛలోక్తి విసిరారు.
