సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వచ్చే జూన్ 5 న జరగనున్న ప్రపంచ పర్యావరణ పురస్కరించుకుని పర్యావరణ కాలుష్యం మరియు పరిసరాల శుభ్రత పై ప్రజలకు ప్రాముఖ్యం తెలియజేయుటకు స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 మరియు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ వారు నిర్వహిస్తున్న మేరీ లైఫ్ మేరా స్వచ్ఛ షెహెర్ కార్యక్రమంలో భాగంగా భీమవరం పురపాలక సంఘం నందు పర్యావరణ పరిరక్షణ పై ప్రజల్లో అవగాహన కల్పించుటకు భీమవరం పురపాలక సంఘం కమిషనర్ శివరామ కృష్ణ వారి ఆధ్వర్యంలో ఎస్ ఆర్ నగర్ అల్లూరి సీతారామరాజు విగ్రహం నుండి భీమవరం పురపాలక సంఘ ఆఫీస్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించబడింది ఈ ర్యాలీలో పురపాలక సంఘ ఇండోర్ మరియు అవుట్డోర్ సిబ్బంది అన్ని వాటి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. తదుపరి మున్సిపల్ ప్రజారోగ్య సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది కలసి స్థానిక బీవీ రాజు పార్క్ పరిసరాల్లో శుభ్రం చేయడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *