సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈరోజు శనివారం ఉదయం భీమవరం పురపాలక సంఘ పరిధిలో కమిషనర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ వార్ల ఆధ్వర్యంలో సానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు వార్డు శానిటేషన్ & ఎన్విరాన్మెంట్ కార్యదర్శులు రెండు బృందాలుగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ పై తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పట్టణంలోని ప్రముఖ హోల్ సేల్ దుకాణాలు మరియు కిరాణా దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు జరిపి సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను కలిగి ఉన్న దుకాణాల యజమానుదారులపై రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అపరాధ రుసుమును విధించి, అక్కడి స్థానిక ప్రజలలో సింగిల్ న్యూస్ ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన, చైతన్యం కలిగించడం కూడా జరిగింది.
