సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మవారి ఆలయంలో గత 60 రోజులుగా భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ఆదాయం కోసం నేడు, శనివారం హుండీ లు తెరచి లెక్కించగా రూ. 55,23,193.00 మొత్తం ఆదాయం లభించగా .. బంగారం: 106 గ్రాములు, వెండి 234 గ్రాములు కొన్ని విదేశీ కరన్సీ నోటులు లభించాయి. ఈ యొక్క లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు మరియు ధర్మ కర్తలు: ముత్యాల వెంకట రామారావు, చెల్లంకి నాగ శేషగిరి, మావూరి సుందరరావు, రామాయణం సత్యనారాయణ, గోపిశెట్టి విజయలక్ష్మి, కోయ వెంకట లక్ష్మీ, నీలాపు విజయ నాగలక్ష్మి,ఎక్స్ అఫీషియో మెంబర్ బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారని దేవాలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రజీ ఒక ప్రకటనలో తెలిపారు.
