సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత చరిత్రలోనే కాదు ప్రపంచ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒకటైన ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటనలో అధికారిక లెక్కల ప్రకారం నేటి ఆదివారం ఉదయానికి మృతుల సంఖ్యా 288 మందికి చేరగా.. ఇంకా చాలామంది విషయ పరిస్థితిలో ఉన్న కారణంగా నేటి సాయంత్రానికి 300 దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. మూలకారణాన్ని గుర్తించామని కేంద్ర రైల్వేమంత్రి అశ్వని వైష్ణవ్ ఆదివారం ప్రకటించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు పూర్తయ్యిందని, రైల్ సేఫ్టీ కమిషనర్ వీలైనంత త్వరగా ఈ రిపోర్ట్‌ను సమర్పిస్తుందని మంత్రి ప్రకటించారు. కాగా మూడు రైళ్లు ఢీకొన్న ప్రాంతాన్ని నేటి ఆదివారం ఉదయం సందర్శించారు. ట్రాక్‌ల పునరుద్ధరణ పనులను 1000మంది ఒరిస్సా కార్మికుల సహకారంతో దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రైల్వే ట్రాకుల పునరుద్ధరణను ఈ రోజే (ఆదివారం) పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని భరోసా ఇచ్చారు. అయితే విచారణలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మెయిన్ లైన్‌లో వెళ్లేలా సిగ్నల్ సక్రమంగానే ఉంది. కోరమాండల్‌కు మెయిన్‌లైన్‌కు సిగ్నల్ ఉండగా.. లూప్‌లైన్‌లోకి ఎలా వెళ్లిందనేదే ఇప్పుడు ప్రశ్నగా మారింది! సిగ్నల్ – పాయింట్ మధ్య లోపం తలెత్తింది. సిగ్నల్ బాగుంది కానీ..ట్రాక్ లు ను మార్చే పాయింట్ మారకపోవడంతో, అప్పటికే గూడ్స్ వెళ్లిన లూప్‌లైన్‌లోకే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కూడా వెళ్లింది. బహనాగ్‌బజార్ రైల్వే స్టేషన్‌లోని డిజిటల్ సిగ్నల్ చార్ట్‌లో ఇదంతా నమోదైనట్లు వార్త సమాచారం. ఈ ప్రమాదం విషయంలో డ్రైవర్ (పైలట్) పాత్రపైనా చర్చ జరుగుతోంది.
