సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, 1 కోటి 31 లక్షల 70 వేల రూపాయల ప్రభుత్వ నిదులల్తో సీసీ రోడ్ ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొన్నారు. పట్టణంలోని 29వ వార్డు సంజీవయ్య నగర్ లో రూ 25 లక్షల 20 వేలతో నెంబర్ 25-9-180 నుండి వరకు 25-9-181/18 వలుకు నిర్మాణం చేసిన నూతన సీసీ రోడ్ ను ప్రారంభించారు. తదుపరి 75 లక్షలతో ఎలక్ట్రికల్ ఫోల్ నెంబర్ SS 105 / ABC నుండి 25-9-183/4 వరకు నిర్మించే సిసి రోడ్ పనులకు, అదే మాదిరిగా 31.5 లక్షలతో డోర్ నెంబర్ 25-9-181 నుండి డోర్ నెంబర్ 25-9-181.19 వరకు నిర్మించే సిసి రోడ్ పనులకు శంకుస్థాపన చేసారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ అందిస్తున్న సహకారంతో పట్టణంలోని ప్రతి వార్డు .. నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాము..అభివృద్ధి .. సంక్షేమం రెండు కళ్ళుగా పని చేస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *