సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమారామంలో లో నేడు, అంతర్జాతీయ తెలుగు సంబరాలు లో మొదటి అంఖం ప్రారంభమయింది. నేడు, సోమవారం నగరంలో శోభాయాత్ర నేపథ్యంలో చంద్ర ప్రతిష్టగా భావించే శ్రీ సోమేశ్వర స్వామి సన్నిధానంలో విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి ఈ వేడుకలను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర స్వామి మాట్లాడుతూ… భారతదేశంలో అందమైన పద భావజాలం ఉన్న భాషగా తెలుగు భాషకు అపారమైన ఆదరణ ఉందన్నారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తెలుగు మాట్లాడే వారుంటారని తెలిపారు. తెలుగు వారు ఎక్కడున్నా మూలాలను మరిచిపోవద్దని… భాష పట్ల వాత్సల్యం చూపాలని సూచించారు. కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష ఒక్కటే అన్నారు. మన పురాతన సంప్రదాయాలకు విలువనిచ్చే ఈ భీమవరం ప్రాంతం తెలుగు భాషకు, సాహిత్యానికి, అతిధుల ఆతిథ్యానికి ప్రాధాన్యమిస్తుందని,ఇక్కడ అంతర్జాతీయ తెలుగు సంబరాలు నిర్వహించడం హర్షణీయమని స్మాత్మానందేంద్ర స్వామి వ్యాఖ్యానించారు.
