సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం టూ టౌన్లో అంబేడ్కర్ చౌక్‌లో గత మంగళవారం రాత్రి అంబేద్కర్ నూతన కాంస్య విగ్రహావిష్కరణ మరియు పాత బస్టాండ్ రోడ్డులో సభ కార్యక్రమం ఘనంగా జరిగింది.అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు ఆవిష్కరించారు. ఆయన సభలో మాట్లాడుతూ.. ‘నేను ఇలా రాజకీయంగా అత్యున్నత స్థాయికి ఎదిగానంటే అంబేడ్కర్ భిక్షేనని, ఆయన రాసిన రాజ్యాంగం నాలాంటి వాళ్లకే కాదు సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు అనేక రూపాల్లో రక్షణ కల్పించింది’ అని అన్నారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భీమవరం నడిబొడ్డున 40 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని, బడుగుల బ్రతుకుల జీవితాలలో వెలుగులు నింపిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తి ని సీఎం జగన్ ఆదర్శంగా తీసుకొన్నారని అన్నారు. కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలను ఆచరించి, ఫలితాలను సాధించి నిలబడినప్పుడే దళిత వర్గాల నిజమైన ప్రగతి అని అన్నారు. ఎస్పీ రవిప్రకాశ్, భీమవరం ఆర్డీవో దాసిరాజు,హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సి.కాశీ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కెప్టెన్ వీరయ్య, డీసీసీబీ చైౖర్మన్ పీవీఎల్ నరసింహరాజు, వేండ్ర వెంకటస్వామి, మేడిది జాన్సన్, పాతపాటి శ్రీనివాసరాజు, కోటిపల్లి బాబు, తోట బోగయ్య, కామన నాగేశ్వర రావు, ఏ ఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు.
