సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. ఈరోజు జరిగిన మంత్రుల సమావేశంలో సీఎం జగన్ ఊహాగానాలకు తెరదించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని సీఎం జగన్ కేబినెట్ సమావేశంలో మంత్రులకు స్పష్టంగా తెలియజేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇక నేటి క్యాబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకొన్నారు. వాటిలో 2024 జూన్ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులగా పర్మినెంట్ చేస్తూ క్యాబినెట్ ఆమోదించారు. . దీనితో రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు ఉద్యోగులు సంబరాలు చేసుకొంటున్నారు. అలాగే రాష్ట్రంలోని కొత్త మెడికల్ కళాశాలల కు 706 పోస్టుల భర్తీకి, ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి, అమ్మఒడి పథకం అమలుకు ,జగనన్న అమ్మ ఒడి పథకాన్ని జూన్ 28న అమలు కు ఆమోదం లభించింది. ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా 5 వేల కోట్ల రూపాయల రుణ సేకరణకు కేబినెట్ ఆమోదించింది.
