సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా డాక్టర్ చదువుల ప్రేవేశం కోసం లక్షలాది మంది విద్యార్థులు ఆతృతగా ఎదురుచూస్తోన్న నీట్ యూజీ ఫలితాలు( NEET UG Results) విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన విద్యార్థి బోర వరుణ్ చక్రవర్తి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించి తెలుగువాడి సత్తా చాటాడు. ఏపీకి చెందిన బోర వరుణ్ చక్రవర్తి తో, పాటు తమిళనాడుకు చెందిన ప్రభంజన్ ఇద్దరూ 720/720 మార్కులు సాధించి 99.99శాతం తో తమ ప్రతిభ ను చాటారు. అలాగే ఈడబ్ల్యూ ఎస్ కేటగిరీలో ఏపీ విద్యా ర్థి వైఎల్ ప్రవధాన్ రెడ్డి రెండో ర్యాంకు సాధించగా.. ఎస్సీ కేటగిరీలో ఏపీకి చెందిన కె.యశశ్రీ కి రెండో ర్యాంకు వచ్చింది. తెలంగాణకు చెందిన కె.జి.రఘురాం రెడ్డి జాతీయ స్థాయిలో 15వ ర్యాం కు సాధించాడు. NEETకు దేశ వ్యా ప్తంగా మొత్తం 11,45,976మం ది అర్హత సాధించగా.. ఏపీ నుంచి 42,836, తెలంగాణ నుంచి 42,654మంది అభ్యర్థులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *