సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు పిలుపు మేరకు పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారి అధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ నేడు, బుధవారం ( 14వ తేదీన) అన్నవరం నుండి చేపడుతున్న “వారాహి”యాత్ర భీమవరం వరకు ఎటువంటి అడ్డంకులు లేకుండా దిగ్విజయం అవ్వాలని కోరుతూ నియోజవర్గంలో సర్వమత ప్రార్థనలు చేపట్టారు. భీమవరం మావుళ్ళమ్మ గుడిలో, రూపాంతర దేవాలయం నందు, పెద్ద మసీదులో పార్టీ తరపున ప్రార్థనలు చేసి మరియు వారాహి యాత్ర గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సెక్రటరీ సుంకర రవి, భీమవరం మండల అధ్యక్షులు మోకా శ్రీనివాస్, మండల సెక్రటరీ కత్తుల నీలెంద్ర, మాజీ కౌన్సిలర్ మాగాపు ప్రసాద్, నాయకులు పంతం ప్రసాద్, పత్తి హరి, మారీసెట్టి రాంప్రసాద్,తదితర నాయకులు మరియు జనసైనికులు, వీరమహిళలు,కార్యకర్తలు పాల్గొన్నారు.
