సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వేసవి లో భగభగ మండుతున్న ఎండలు నేపథ్యంలో తగిన దిగుబడులు లేక కూరగాయల ధరలు కూడా తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చుసిన మండిపోతున్నాయి. భీమవరం రిటైల్ మార్కెట్ చూసుకొంటే.. ఉల్లిపాయలు కేజీ కి 25 రూపాయలు బంగాళాదుంపలు , క్యాబేజి, టమాటాలు కేజీకి 40 రూపాయలు పలుకుతుంటే .. ఇక మిగతా అన్ని కూరగాయల ధరలు కిలో రూ.50కి పైమాటే..ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే క్యారెట్‌, క్యాప్సికంతో పాటు హైబ్రిడ్‌ చిక్కుడు కాయలు వంటి కూరగాయలు కూడా 80- 100 రూపాయలు మధ్య ధరలు పలుకుతున్నాయి. చాలా రకాలు రూ.60పైనే పలుకుతున్నాయి. వేసవి కారణంగా కూరగాయల ఉత్పత్తి తగ్గిందని, సరుకు పెద్దగా మార్కెట్‌కు రావట్లేదంటూ వ్యాపారులు అధిక ధరకు అమ్ముతున్నారు. వేసవి కావడంతో ఆకు కూరల సాగు తగ్గడంతో గోంగూర, తోటకూర కట్ట సైజ్ బట్టి రూ10-.20కి తక్కువ లేదు. పుదీనా, కొత్తిమేర కట్ట రూ.30 దాకా చెబుతున్నారు. నిమ్మకాయలు ధరలు మాత్రం బాగా దిగివచ్చాయి.తోపుడు బండ్లతో ఇళ్ల ముందుకు వచ్చే రిటైల్‌ వ్యాపారులు కూరగాయల నాణ్యతను బట్టి రేట్లు వసూలు చేస్త్తున్నారు. పావు కిలో, అరకిలో అయితే కిలో రేటు సగంకన్నా ఎక్కువ చెబుతున్నారు. రియల్ మార్ట్ , రైతుబజార్ల తో పోలిస్తే , బహిరంగ మార్కెట్ల ధరలకు కిలోకి రూ.10దాకా తేడా ఉంటోంది. వడగాల్పుల తీవ్రతకు పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు బాగా తగ్గించడంతో 30 గుడ్లు 160 – 170 కి , చికెన్‌ కేజీ ధరలు 350 కి అమాంతం పెరిగిపోయాయి.వర్షాలు పడి ఉత్పత్తి పుంజుకుంటే తప్ప ధరలు క్రిందకు రావు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *