సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడ జిల్లా లో వారాహి యాత్ర ప్రారంభిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాత్రి 7 గంటలకు కత్తిపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ విధానాల తో ప్రజలు బాధలు పడుతున్నారని, . ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భవి ష్యత్తు గోదావరి జిల్లాల చేతుల్లోనే ఉందని జనసేన అధి నేత పవన్‌కళ్యాణ్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆవేశంతో ఓటు వేయొద్దని.. కులం ప్రక్కన పెట్టి ఆలోచించి ప్రతిఒక్కరు ఓటు వేయాలని కోరారు. ఈసారి మాత్రం ఓటర్లు తన గ్లాస్ గుర్తుపై బలంగా గుద్దాలని .. ఈసారి అసెంబ్లీ లో అడుగుపెట్టి తీరుతానని .. ఎవరు తనను ఆపలేరని, జనసేనను విజయవంతంగా అసెంబ్లీకి పంపిస్తే కడ శ్వాస వరకు ప్రజలకు అండగా నిలబడతా అన్నారు. పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ లో అడుగు పెట్టనియ్యకూడదు అని తాను పోటీ చేసే నియోజకవర్గానికి అధికారపార్టీ అభ్యర్థులు 200 కోట్లు ఖర్చుపెట్టానికి సిద్ధంగా ఉన్నారని , గతంలో భీమవరం లో లక్ష ఓట్లు ఉంటె తనను ఓడించడానికి 10 వేల ఓట్లు కలిపారని ఆరోపించారు. ( నిజానికి అపట్లో టీడీపీ అధికారంలో ఉంది.. భీమవరం అసెంబ్లీ పరిధి ఓట్లు సుమారు 2లక్షల 45 వేలు ..) వైసిపి అభ్యర్థులకు అంత డబ్బు ఎక్కడనుండి వస్తుందని? ప్రశ్నించారు. ఈసారి తాను ఎక్కడ తగ్గనని , రాజకీయాలు చేస్తానని పోలింగ్ బూత్ ల వద్ద పార్టీ క్యాడర్ తేడా వస్తే మన దమ్ము చూపించాలన్నారు. బీసీలను అదుకొంటామని తనను వారు కూడా నమ్మాలని యువతతోపాటు అన్ని వర్గాల ప్రజలు ఆహ్వానిస్తే తాను సీఎం అవుతానని జనసేన పార్టీ కులరహితంగా అందరికి అండగా ఉంటుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *