సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖలో నేడు, గురువారం స్థానిక ఎంపీ కుటుంబం కిడ్నాప్ కావడం తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపితే కొన్ని గంటలలో కథ సుఖాంతమైంది. కాగా విశాఖలో ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావుతోపాటు స్థానిక వైసిపి ఎం పీ, ఎం వీవీ సత్య నారాయణ భార్య జ్యోతి, కుమారుడుని దుండగులు కిడ్నాప్ చేశారు. ముగ్గురిని అపహరించి ఎంపీని రూ. 50 కోట్లు డిమాండ్ చేశారు.అయితే కిడ్నా ప్ జరిగిన కొద్ది గంటల్లోనే కేసును ప్యూహాత్మకంగా పోలీసులు చేధించారు. నలుగురు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నా పర్లలో ప్రధాన నిందితుడు హేమంత్ గా పోలీసులు గుర్తించారు. కిడ్నప్ సమాచారం రాగానే పోలీసు అధికారులు ఏకంగా 17 బృందాలను ఏర్పాటు చేసి కిడ్నా పర్లను పట్టుకొని పోలీసులు తలచుకొంటే ఏమవుతుందో…తమ సత్తా చాటారు. ఇదే స్ఫూర్తి.. వేగం.. సామాన్యుల కిడ్నప్ .. మిస్సింగ్.. కేసుల విషయంలో కూడా పోలీస్ లు వ్యవహరిస్తే .. ఎందరో పేద, సామాన్య తల్లి తండ్రుల గుండె కోతలు తప్పుతాయి కదా?
