సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినప్పటికీ విస్తరణ వేగంగా జరగటం లేదు. మరో ప్రక్క ఎండలు కనివిని ఎరుగని రీతిలో దంచి కొడుతున్నాయి. జులై 3వ వారంలో ప్రవేశిస్తున్న ఎండలు తగ్గేది లే.. అన్న రీతిలో ప్రచండంగా నిప్పులు కురుపిస్తునట్లు ఎండలు కాస్తున్నాయి. పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో సైతం మధ్యాహ్నం మాత్రమే కాదు.. రాత్రి పగలు తేడా లేకుండా తీవ్ర ఉక్కబోత వడగాల్పులకు గురి అవుతున్నారు. గత 3 వారాలుగా ఎడతెగకుండా నిన్న శుక్రవారం వరకు జిల్లా అంతటా 42 నుండి 46 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రతి రోజు నమోదు అవుతుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్ధం అవుతుంది. జిల్లా కేంద్రం భీమవరంలో ప్రధాన రోడ్లపై ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు జనసంచారం దాదాపు కానరావడం లేదు. ఫ్లాట్ పారం దుకాణాలు, మిక్చర్లు బండ్లు రాత్రి 7 గంటల తరువాతే కనిపిస్తున్నాయి. ఆసుపత్రులు, చర్మ వ్యాధుల ఆసుపత్రులు వద్ద మాత్రం ఉదయం 8గంటల నుండి రాత్రి 9 గంటల వరకు చిన్నారులు, రోగులతో వారి బంధువులుతో హౌస్ ఫుల్ అవుతున్నాయి. కరెంట్ వాడకం ఎక్కువ జరగటంతో ఎక్కడయినా ట్రిప్ అయ్యి ఒక గంట కరెంట్ ఆగితే ఇక ఇండ్ల లో పేద మధ్యతరగతి ప్రజల కష్టాలు చెప్పనక్కరలేదు. ఇక విద్య సంస్థలు తెరచిన ఎండలు కు భయపడి విద్యార్థులు హాజరు తక్కువగానే ఉంటుంది. ఆక్వా , పౌల్ట్రీ దిగుమతులు పడిపోయాయి. ఇక బిజినెస్ తగ్గి వ్యాపారస్తులు కష్టాలు పైకి చెప్పుకొనేవి కాదు.. ఇది పరిస్థితి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *