సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సుప్రీం కోర్ట్ లో ప్రముఖ న్యాయవాది గా తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధులయిన డీవీ రావు గారి తల్లి శ్రీమతి డబ్బీరు వెంకటసరోజనమ్మ ఇటీవల తీవ్ర అనారోగ్యంతో చెన్నయ్ లో ప్రముఖ హాస్పటల్ లో చికిత్స తీసుకొంటూ పరిస్థితి విషమించడంతో నేడు, బుధవారం స్వర్గస్తులయ్యారు. ఆమె అంత్యక్రియలు రేపు గురువారం వారి స్వగ్రామం శ్రీ కాకుళం జిల్లా లోని ‘అలుదు’ లో చెయ్యడానికి నిర్ణయించారు. సరోజనమ్మ మృతి పట్ల హైకోర్టు , సుప్రీం కోర్ట్ న్యాయవాదులు పలువురు డివి రావు కు సంతాపం తెలియజేస్తున్నారు.
