సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా అల్ టైం ‘మాస్ క్రేజ్’ ఉన్న ‘గ్రంధి శ్రీనివాస్ ‘ తిరిగి రాజకీయాలలోకి వస్తారా? అన్న చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతున్నా వేళా.. నేడు, గురువారం భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్థానిక గొల్లవాని తిప్పా రోడ్డులోని భీమవరం ఏరియా ఆసుపత్రి ని నిర్మాణ పనులను పర్యవేక్షించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకొన్న మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. తనకు రాజకీయాలు చేసి పదవులు పొందాలని ఆశ ఎప్పుడు లేదని , తాను భీమవరం అభివృద్ధికి చెయ్యవలసినంత చేసానని, జిల్లా కేంద్రం కూడా సాధించానని.. అయితే మరల ప్రజలు కోరుకొంటే .. తనకు ప్రధాన రాజకీయ పక్షాలు నుండి పిలుపు వస్తే పరిశీలిస్తానని, మాత్రమే సమాధానం చెప్పారు. ‘ఇక తాజా విషయానికి’ వస్తే.. 2019 నుండి 2024 వరకు ఎమ్మెల్యేగా 2వ పర్యాయం పనిచేసిన గ్రంధి శ్రీనివాస్ ప్రభుత్వ ఆరోగ్య సేవలు భీమవరం పరిసర ప్రాంత ప్రజలకే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణ జిల్లా ప్రజలకు కూడా అందుబాటులోకి రావాలన్న విశాల దృక్పధంతో అప్పటికే మంజూరు అయిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని 100 పడకలుగా అప్పటి జగన్ ప్రభుత్వం తో ఆమోదింపచేసారు. స్థలం కొనుగోలుకు అదనపు కోట్ల రూపాయల నిధులు అవసరం కావడంతో గ్రంధి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు సహకారంతో గొల్లవానితిప్ప రోడ్డులో కోట్ల రూపాయలు విలువ చేసే’ 4 ఎకరాల స్వంత స్థలాన్ని’ ఆసుపత్రి నిర్మాణానికి కానుకగా ఇచ్చారు. స్థలంలో 2023 జనవరిలో గ్రంధి వెంకటరత్నం, వెంకటేశ్వరరావుల పేరుతొ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం ఏరియా హాస్పిటల్ నిర్మాణం ప్రారంభం అయింది. దీనికి అప్పటి సర్కార్ మొదటగా 10కోట్ల 15 లక్షల నిధులు మంజూరు చేసినప్పటికీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పట్టుదలతో చేసిన కృషి నేపథ్యంలో .. ఈ చుట్టుప్రక్కల ఎక్కడ లేని విధంగా పేద సామాన్యుల కోసం ఆధునిక వసతులతో నిర్మింఛే 100 పడకల ఆసుపత్రి కోసం నాబార్డ్ నుండి మరో రూ 28 కోట్ల నిధులు మంజూరైనట్లు 2023 నవంబర్ 7న ప్రకటించారు. అంటే మొత్తం 38 కోట్ల 15 లక్షల నిధులు మంజూరు అయ్యాయి. దానితో 2 అంతస్తులల్తో విశాలమైన కొత్త భవనాల నిర్మాణాల పనులు కూడా ప్రారంభమయ్యాయి. అప్పటికి తన పదవి కాలం మిగిలి ఉన్న మరో 15 నెలలు వ్యవధిలో నిర్మాణం పూర్తీ చెయ్యాలని లక్యంతో పనులు పరుగులు పెట్టించారు. అయితే 2024 జూన్ 5న ఎన్నికల ఫలితాలలో గ్రంధి శ్రీనివాస్ పరాజయం పొందటంతో కొన్ని అవాంతరాలతో తిరిగి ఆసుపత్రి నిర్మాణం కొనసాగుతుంది. దీనికి స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి ‘భూపతిరాజు శ్రీనివాస వర్మ’ కూడా మరిన్ని ఆధునిక వైద్య హంగులు, కిడ్నీ రోగులకు డయాలసిస్ అవసరాల కోసం ‘రాష్ట్ర ఆరోగ్య సఖ మంత్రి’ సత్య కుమార్ కు రికమండ్ చెయ్యడంతో కోస్తా ఆంధ్ర లో ఒక అత్యాధునిక ప్రభుత్వ హాస్పటల్ ప్రజలకు వైద్య సేవలు అందించడానికి త్వరలో అందుబాటులోకి రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *