సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్. వారాహి యాత్రలో భాగంగా జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా నేడు, శనివారం ఆయన కాకినాడలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో దివ్యాంగుల సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ తల్లి తన దివ్యాంగుడైన కొడుకును తీసుకొచ్చి తమకు పింఛను కు అర్హతలు ఉండటంతో వైసిపి ప్రభుత్వం దివ్యంగుల కిచ్చే పెన్షన్ ఇచ్చిందని అయితే చాల కాలం క్రితమే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని పింఛన్ కట్ చేశారని ఈ పెద్ద వయస్సులో సరైన ఆదాయం, పింఛను లేకుండా కుమారుడిని ఎలా సాకాగలనని? కన్నీళ్లు పెట్టుకుంది. ఈ పరిణామంతో పవన్ కూడా చలించిపోయి ఆమెను ఓదారుస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చాల చోట్ల ఇలానే ఎదో వంకతో అర్హులకు వృద్దులకు పించన్లు, విద్యార్థులకు అమ్మవడి ,పీజు రీఎంబెర్స్మెంట్ లు ఫై.. ఫై కారణాలు చెప్పి నిలిపి వేస్తున్నారని, మీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని పవన్‌కల్యాణ్ ఆమెకు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *