సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో దశాబ్దాలుగా ప్రతిష్టాకర డిగ్రీ కాలేజీగా విరాజిల్లు తున్న డి.యన్.ఆర్ కళాశాలలో 2023-24 విద్య సంవత్సరానికి గాను విద్యార్ధులు డిగ్రి కోర్సులో ఆన్ లైన్ ప్రవేశం పొందుటకు వీలుగా హెల్ప్ లైన్ సెంటర్ ను నేడు, శనివారం కళాశాల పాలకవర్గ ఉపాధ్యక్షులు, గోకరాజు పాండురంగరాజు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా మరియు చుట్టు ప్రక్కల జల్లాలకు చెందిన విద్యార్ధులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచు కోవాలని అన్నారు. పాలకవర్గ అధ్యక్షులు, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ నిబందనల ప్రకారం డిగ్రీ కోర్సులలో ప్రవేశం ఆన్ లైన్ ద్వారానే జరగవలసి ఉన్నందున ఇందుకు అవసరమైన పూర్తి సదుపాయాలు కళాశాలలో కల్పించడమైనది అని అన్నారు. కశాశాల ప్రిన్సిపాల్ డా.బి.యస్.శాంక కుమారి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆన్ లైన్ ప్రవేశ వివరాలను విద్యార్ధులకు తెలియజేసారు.
