సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు దేశవ్యాప్తంగా కుష్ఠు వ్యాధి బాధితుల నిర్ధారణ సర్వే నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేపట్టనుంది. రేపుటి సోమవారం నుండి ఆరోగ్య కేంద్రాలలో వైద్యాధికారులకు సర్వేపై అవగాహన కల్పించనున్నారు. సర్వే ఎలా చేయాలి ? కుష్టు వ్యాధి మచ్చలను ఎలా గుర్తించాలి ? అనే అంశాలపై వారు ఆశా వర్కర్లకు మంగళవారం శిక్షణ ఇస్తారు, ఈనెల 26 నుండి జిల్లాలో ఆశా వర్కర్లు, 1,395 మంది గ్రామ, వార్డు వలంటీర్ల సహాయంతో తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి ప్రతి ఒక్కరిని పరిశీలిస్తారు. అనుమానించ తగిన లక్షణాలు ఉంటే వాటిని నమోదు చేసి, వైద్య ధికారులకు సమాచారం అందిస్తారు. వైద్యులు వారికి వైద్య సహాయం అందజేస్తారు. జిల్లాలో ప్రస్తుతం 90 మంది కుష్టు వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరందరికి రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలందిస్తున్నారు. అయితే జిల్లాలో సర్వే చేస్తే సుమారు 200 కేసులు పైగా కుష్ఠు వ్యాధి కేసులు ఉండే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
