సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొత్తగా ఏర్పడుతున్న అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న అల్పపీడన ప్రభావంతో నేటి గురువారం నుండి కోస్తా ఆంధ్ర గోదావరి జిల్లాలలో వర్షాలు ప్రారంభమయ్యి జూలై 8వ తేదీ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈవర్షాలు రైతులకు మేలు చేసేవిగా భావించాలిదీంతో సబ్డుగా ఉన్న . రుతుపవనాలు కూడా చురుకు మారే అవకాశం ఉందని అంచనా వేసింది.. వాతావరణ కేంద్రం ప్రకారం.. ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని శుక్రవారం (జూలై 3) బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది క్రమంగా రాజస్థాన్ వైపు పయనిస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
