సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో పీఎస్‌యూలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు సంబంధించిన పదవీ విరమణ వయస్సు ను 60 నుండి 62 ఏళ్లకు పెంచుతూ నేడు, గురువారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. గతంలో రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా తాజగా ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుంచి రిట్రోస్పెక్టివ్‌గా అమలు కానుంది. అలాగే, 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ పొందిన అర్హులైన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం ఉంది. మళ్లీ జాబ్‌లో చేరే వరకు ఉన్న గ్యాప్ పీరియడ్‌కు జీతం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
