సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియాలో విభిన్న గెటప్ లతో కనపడుతూ సంచలన వ్యాక్యలు చేస్తూ పాపులర్ అయిన రాకేశ్ మాస్టర్ కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాకేశ్.. నేడు, ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో జాయిన్ అయ్యి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వారం రోజుల క్రితం తన మిత్రులతో కలిసి వైజాగ్‌కు వెళ్లిన ఆయన.. ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చారు. రాకేశ్ ప్రాణాలను కాపాడటం కోసం వైద్యులు అన్ని విధాలా ప్రయత్నించినా.. అవేమీ ఫలించలేదు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మృతిచెందినట్లు గాంధీ డాక్టర్లు మీడియాకు వెల్లడించారు. రాకేశ్ మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, ఆయన శిష్యులు కన్నీరుమున్నీరవుతున్నారు ఇదిలావుంటే.. విజయనగరంలోని ఓ ఫాంహౌస్‌లో ఇటీవలే ఓ సినిమా షూటింగ్ జరిగింది. అయితే.. ఓ సీన్‌లో 20 ఫుల్ మందు బాటిల్స్ తాగారని.. అప్పట్నుంచే రాకేశ్ అస్వస్థతకు గురయ్యారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్‌లో ఆయన 1500కు చిత్రాలకు పైగా కొరియోగ్రఫీ అందించారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి వారికి శిక్షణ ఇచ్చాడు. ఈ ఇద్దరూ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ కొరియోగ్రాఫర్లుగా ఉన్నారు. ప్రభాస్ తోలి చిత్రం ఈశ్వర్ , తో పాటు సీతారామరాజు ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘దేవదాసు’, ‘చిరునవ్వుతో’, ‘సీతయ్య’, ‘వంటి సూపర్ హిట్ చిత్రాలకు రాకేశ్ కొరియోగ్రఫీ అందించారు
