సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని, దేశం కోసం, రాష్ట్రం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయుడు ప్రకాశం పంతులు అని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుఅన్నారు. భీమవరం ప్రకాశం చౌక్ లో విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో నేడు,గురువారం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, మెంటే పార్ధసారధి ఆవిష్కరించారు. వక్తలు మాట్లాడుతూ..భీమవరంలో ఆయన నమ్మకరణంతొ ఉన్న ప్రకాశం చౌక్ సెంటర్ లో ప్రకాశం పంతులు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, మెంటే నిర్మాణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఆగస్టు 23న టంగుటూరీ జయంతి సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, 90 ఏళ్ల క్రితం ప్రకాశం పంతులు భీమవరం వచ్చారని, అప్పటి నుంచి ఈ ప్రాంతానికి ప్రకాశం చౌక్ గా నామకరణం చేశారని అన్నారు. ప్రజా ప్రతినిధులు సహకారం, దాతల సౌజన్యంతో ఈ ప్రాంతంలో ప్రకాశం పంతులు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
