సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం రాయలం గ్రామంలో గురువారం జరిగిన వికసిత్ భారత్- గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్- గ్రామీణ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని మాట్లాడారు. పాత ఎంజీఎన్ ఆర్ ఈజీఏ స్థానంలో వచ్చిన ఈ కొత్త చట్టం ద్వారా ఇకపై గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి 100 రోజులకు బదులుగా ఏకంగా 125 రోజుల పని దినాల చట్టబద్ధమైన గ్యారెంటీ లభించనుందన్నారు. నూతన చట్టం ప్రకారం దేశ వ్యాప్తంగా రోజువారీ సగటు కూలి రేటును రూ 298.8 నుంచి రూ 327.4 కు పెంచారని, సగటున రోజుకు రూ 28.6 మేర కూలి పెరిగిందన్ ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సగటున 10 శాతానికి పైగా కూలి రేట్లు పెరిగాయని, సమృద్ధికరమైన గ్రామాల ద్వారా వికసిత్ భారత్ నిర్మాణంలో ఇదొక చారిత్రాత్మక అడుగు అని అన్నారు. అర్హులైన ఏ ఒక్క గ్రామీణ కార్మికుడు కూడా ఒక్క రోజు కూడా పని లేకుండా ఉండకూడదన్నదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో గ్రామస్థులు, గ్రామ పెద్దలు, అధికారులు, కూటమి నాయకులు, పాల్గొన్నారు.
