సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టాక్ అటు ఇటుగా వచ్చిన సరే.. భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మేనియా ప్రభావంతో.. జై శ్రీ రామ్.. అంటూ ‘ఆదిపురుష్’ గత 3 రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేస్తుంది. మొదటి రోజు 140 కోట్ల కలెక్షన్ వసూళ్లు చేసిన ఆదిపురుష్ నేటి ఆదివారం 3వ రోజుకు సుమారు 350 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూళ్లు చేసి భారతీయ సినీ పరిశ్రమలో నెంబర్ 1 హీరో అనిపించాడు. ఇక భీమవరం విషయానికి వస్తే 10 థియేటర్స్ లో మొదటి రోజు 58 ఆటలు, 2వ రోజు 30 ఆటలు, 3వ రోజు 30 ఆటలు తో కేవలం 3 రోజులలో మొత్తం సుమారు 75 లక్షల వసూళ్లు సాధించి కోటి రూపాయలు వైపు పరుగులు పెడుతున్నాడు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కేవలం 3 రోజులకే 3 కోట్ల పైగా షేర్ సాధించి మరో సంచలనం రేపాడు.
