సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో కనివిని వరుసగా 3 వారాలుగా కాస్తున్న ఎండలు దెబ్బకు వరి పండించే రీతులలో సార్వా సాగుపై రైతాంగంలో అయోమయం మెల్లగా తొలగిపోతుంది. నిన్న ఆదివారం, నేడు, సోమవారం తెల్లవారు జాము నుండి ఉదయం వరకు భీమవరం పరిసర డెల్టా ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలతో రైతుకు సార్వా సాగుకు ఉపక్రమించవచ్చునని భరోసా లభిస్తుంది. అయితే మధ్యాహ్నం వడగాలులతో ఎండలు కాస్తున్న కొంత ఉష్ణోగ్రతలు తగ్గాయి. అంటే 45- 43డిగ్రీల స్థాయి నుండి 38-36 డిగ్రీల సెంటిగ్రేట్ స్థాయి కి గత 2 రోజులుగా తగ్గుదల కనిపిస్తుంది. ఇక వ్యవసాయ శాఖ అధికారుల సూచన ప్రకారం ఈనెల 15వ తేదీలోగా నారుమడులు పక్రియ ప్రారంభమై వచ్చేనెల 15 నాటికి నాట్లువెయ్యాలి. ఐతే ఈ నెల మొదటి వారంలో కూడా పంట కాల్వలకు నీరు వచ్చినా రైతులు మండే ఎండలకు నారుమళ్లు ఎండిపోతాయని భయపడి నైరుతి రుతుపవనాల కోసం ఎదురుచూసారు. మందకొడిగా రుతుపవనాలు విస్తరిస్తున్న నేపథ్యంలో.. గత 2 రోజులు గా ఉదయం పూట కురిసిన వర్షాలతో ఇక నారుమళ్లు కు రైతులు ఉపక్రమిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *