సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్రానికి ముందస్తు ఎన్నికలు జనవరి లోగ వస్తాయని ప్రచారం జరుగుతున్నా వేళా.. అలాగే రాష్ట్రానికి మరో 9 నెలలలో ఎన్నికల రానున్న వేళా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో.. పశ్చిమగోదావరి జిల్లాలో అధికారులు ఓటర్ల జాబితాపై దృష్టిపెట్టారు.పశ్చిమ గోదావరి జిల్లాలో 16.37 లక్షల మంది ఓటర్ల ఉన్నారు. ఇందులో ఒకే ఇంటినెంబరు పై 10కి మించి ఓటర్లు ఉంటే వారిపై అధికారులు ప్రత్యేక పరిశీలన చేస్తున్నారు. జిల్లాలో ఇటువంటి ఓటర్లు 6,826 మంది ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. భీమవరంలోని సూర్యనారాయణపురం, బ్యాంకు కాలనీ, తదితర ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్, ప్రశాంతి స్వయంగా వచ్చి పరిశీలన చెయ్యడం విశేషం. ఒకే ఇంటి నంబరుతో ఎందుకు అన్ని ఓట్లు నమోదు అయ్యాయని ఇది ఎలా సాధ్యం? అధికారులను ప్రశ్నించారు. ఒట్లను ఆన్లైన్ చేసే సమయంలో కొందరి ఓటర్ లను పక్కింటి ఇంటి నెంబర్ క్రింద లేదా ఒక చోట అద్దెకు ఉన్న అనేక మంది ఓటర్లు ను ఒకే డోర్ నెంబరుపై నమోదు చెయ్యడం వల్ల కూడా ఇటువంటి ఇబ్బందులు వచ్చాయని తెలుస్తుంది. ఒకవేళ డమ్మీ ఓటర్లు అని రుజువైతే దానిపై దర్యాప్తు చేసి వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.
