సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు,శుక్రవారం ఉదయం ఉండి నియోజకవర్గంలో ‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ మరియు ఆజీవికా మిషన్ గ్రామీణ’ (VB-G RAM G) పథకాన్ని నియోజకవర్గ స్థాయిలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణ రాజు ప్రారంభించారు. గ్రామంలోని చెరువును సమగ్రంగా అభివృద్ధి చేసి, చెరువు చుట్టూ మొక్కలు నాటి, ప్రజలు ఆరోగ్యకరమైన వాతావరణంలో వాకింగ్ చేసేందుకు వీలుగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసే పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రఘురామ’ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించడంతో పాటు, సహజ వనరుల పరిరక్షణ, గ్రామ మౌలిక వసతుల అభివృద్ధి ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యమని, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను స్వయం సమృద్ధి దిశగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని అన్నారు
