సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: టాలీవుడ్లో డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా, దర్శకుడిగా పలు చిత్రాలను అందించారు నామ అభిషేక్. నిర్మాతగా ‘గూఢచారి’, ‘ది కాశ్మీర్ ఫైల్స్’, దర్శకుడిగా ‘డెవిల్: ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ చిత్రాలను రూపొందించారు. ఆయన స్వీయ దర్శకత్వంలో ‘పెద్ద కాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా అందించిన సినిమా ‘నాగబంధం’. విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన ఈ ఫాంటసీ సినిమా మీద ట్రైలర్స్ తో ప్రేక్షకులకు మంచి అంచనాలు ఉన్నాయి. నేడు,శుక్రవారం ఈ సినిమా రిలీజ్ అయ్యింది. . సినిమా కధ విషయానికి వస్తే.. : 1960లో ఇద్దరు ఔత్సాహిక అర్కియాలజిస్టులు టెస్లా, అలీ (రిషబ్) హిమాలయాలలో సర్వే చేస్తుండగా అక్కడే కాలవృక్ష బంధనంలో బందీగా ఉన్న బైరాగి అనే తాంత్రికుడు అలీని వశ పరుచుకుంటాడు. అక్కడే నాగబంధం విముక్తికి సంబంధించిన ఓ పుస్తకం టెస్లాకి దొరుకుతుంది. అటు అలీని వశపరచుకున్న బైరాగి ప్రపంచాన్ని శాసించే శక్తులు అందించ గల బ్రహ్మ కమలాన్ని కనిపెట్టి తీసుకు రావాలని ఆదేశిస్తాడు. టెస్లా తనకు దొరికిన నాగంబంధం పుస్తకాన్ని ఆర్కియాలజీ శాస్త్రవేత్త ప్రభాకర్ (జగపతిబాబు)కు అందిస్తాడు. ఇదిలా ఉంటే అనాధ అయిన రుద్ర (విరాట్ కర్ణ) శ్రీరంగపురం సమీపంలో తనను చేరదీసిన కుటుంబంతో కలిసి ఓ గూడెంలో జీవిస్తుంటాడు. హీరో చెల్లి పెళ్లి నిమిత్తం రంగనాథ స్వామిని దర్శించుకునేందుకు శ్రీరంగపురం వెళ్లిన రుద్ర అక్కడ తొలి చూపులోనే పార్వతి (నభా నటేశ్)ని ప్రేమిస్తాడు.అదే సమయంలో అక్కడి అలయంలోని బ్రహ్మ కమలం అపహరణకు గురవుతుంది. అక్కడి నుండి కధ అనేక మలుపులు తిరుగుతుంది. అసలు ఆ కమలం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే…ఇక ఈ సినిమా మరణాన్ని జయించడం కోసం మనిషి అడ్డదారులు తొక్కితే కాలమే అతనికి సమాధానం చెబుతుందనే కాన్సెప్ట్‌తో రూపొందింది జగపతి బాబు కీలక పాత్రలో నభా నటేశ్, మహేశ్ మంజ్రేకర్, మురళీశర్మ, గరుడ రామ్, దక్ష నగర్కర్, శరణ్య, ఐశ్వర్యమీనన్ వంటి తారాగనణంతో భారీ బడ్జెట్, క్వాలిటీ విజువల్స్, అనంత పద్మనాభ స్వామి వంటి బ్యాగ్రౌండ్ పాటలు చిత్రీకరణ హైలైట్స్ గా నిలిచాయి. అయితే . ఫ్రీ ఇంటర్వెల్ వరకు స్పీడుగా నడిచిన సినిమాకు సడన్‌గా సెకండ్ హాఫ్ హిందూ మతం, సనాతన ధర్మం..పై వచ్చే డైలాగులు బలవంతంగా చెప్పిస్తున్నట్లు ఉంది తప్ప ఫీల్ లేదు. సినిమా ముగింపులో వెనక కథ తెలుసుకోవాలంటే మరో పార్ట్ తీసే వరకు ఆగాల్సిందే అంటూ ముగించడం ప్రేక్షకుల్లో అసహనం కలుగజేస్తుంది.నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేయని విషయం స్పష్టం అవుతుంది. నిడివి మూడు గంటల 16 నిమిషాలు ఉండి సాగదీసినట్లు అనిపిస్తుంది.
