సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హీరో పాపులారిటీ సాధించిన నిఖిల్‌ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘స్పై’…గ్యారీ దర్శకత్వం వహించారు. ఈనెల 29న విడుదల అవుతోంది. ఈ చిత్రం స్వంత్రంత పోరాట యోధుడు , ఆజాద్ హింద్ ఫౌజ్ అధినేత సుభాష్ చంద్ర బోస్ మరణం ఫై ఉన్న మిస్టరీ ని చేధించే కథతో నిర్మించారు. ఇక ఈ చిత్రంలో రానా అతిథి పాత్రలో నటించారు. అయితే ఈ చిత్రంలో రానా ఎంట్రీ కీలకం అని, ఆయన చాల కీలక పాత్రలో నటిస్తున్నారని ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కానుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఆర్యన రాజేష్ , ఐశ్వర్య మీనన ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే టీజర్‌తో పాటు కొన్ని పాటలు బయటకు వచ్చాయి. ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతున్నాయి. యువ హీరో,నిఖిల్ సినిమాల ఎంపిక లో చాల స్పెషల్ అని స్పై’ మరోసారి నిరూపించబోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *