సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మీదుగా నరసాపురం–గుంటూరు మధ్య నడిచే (17281–17282) ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు గత కొంత కాలం విరామం తరువాత రేపు , సోమవారం నుంచి పట్టాలు ఎక్కనున్నాయి. అయితే గుంటూరు లో ట్రాక్ ఆధునీకరణ పనులలో భాగంగా దీనిని ఈ నెల 23వ తేదీ వరకు విజయవాడ వరకే నడపనున్నారు. తర్వాత గుంటూరుకు పొడిగిస్తారు. అయితే దీనిని విజయవాడ వరకు నడపాలని ప్రయాణికులు గత నెలరోజులుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా రైల్వే అధికారులు వాయిదాలు వేస్తూ వచ్చారు. అయితే ఈ సమస్యఫై నరసాపురం ఎంపీ,రఘరామకృష్ణంరాజు గత శుక్రవారం రైల్వే మంత్రిని కలిసి ప్రయాణికులకు ఈ రైలు ప్రాధాన్యతను వివరించారు. విజయవాడ లోని రైల్వే జి ఎం కు పంపిన విజ్ఞాపన లేఖలో ముందు కనీసం విజయవాడ వరకు రైలు నడపాలని కోరారు. దీనికి అమోదం తెలపడంతో సోమవారం నుంచి ఈ ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ వరకు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. పాత షెడ్యూలు ప్రకారం నరసాపురంలో ఉదయం ఆరు గంటలకు, తిరిగి విజయవాడలో సాయంత్రం 6.15 ఈ రైలు బయలు దేరుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *