సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డార్లింగ్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ‘ప్రాజెక్ట్ K’ పై పాన్ వరల్డ్ సినిమాగా భారీ అంచనాలు ఉన్నాయి, ఇంకా ఈ సినిమాలో అమితాబ్, కమల్ హాసన్ వంటి సీనియర్ సినీ దిగ్గజ హీరోలు నటిస్తుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. హీరో ప్రభాస్ అభిమానుల కోసం నేడు బుధవారం హీరో ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు, గత సినిమాలతో పోలిస్తే ‘ప్రాజెక్ట్ K’ ప్రభాస్ సరికొత్తగా కనిపించాడు. ఒళ్లంతా ఆధునిక యుగానికి చెందిన రోబో లాంటి సూట్ ఉన్నప్పటికీ.. ప్రభాస్ ముఖం మాత్రం పురాణ కాలానికి చెందిన వ్యక్తిగా పొడవైన జుట్టుతో కనిపించాడు. చేతితో భూమిని గుద్దితే, అది బద్దలైనట్లు ఈ ఫొటోలో చూపించారు. ప్రస్తుతం చిత్రబృం దం అమెరికాలో ఉంది. రేపు గురువారం జరిగే కామికాన్ ఈవెంట్ లో టైటిల్ ఏంటనేది రివీల్ చేయనున్నారు. వైజయంతీ మూవీస్ ఏ మాత్రం ఖర్చు కు వెనకాడకుండా తీస్తోంది. వచ్చే సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు కొన్ని రోజుల ముందు ప్రకటించారు మరి..
